సిడ్నీ : నెదర్లాండ్స్ ఓపెనర్ విక్రమ్ జిత్ ఔటయ్యాడు. భువనేశ్వర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 180 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 11 పరుగులకే తొలి వికెట్‌ను కోల్పోయింది. విక్రమ్‌జిత్ 9 బంతుల్లో కేవలం ఒక్క రన్ మాత్రమే చేశాడు.
అంతకముందు ఇండియన్ టాపార్డర్ బ్యాటర్లు రాణించారు. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత ఓవర్లలో ఇండియా రెండు వికెట్ల నష్టానికి 179 రన్స్ చేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌లు హాఫ్ సెంచరీలతో హోరెత్తించారు. నిజానికి సిడ్నీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించలేదు. ఆరంభంలో బ్యాటర్లు కష్టపడ్డారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ కేవలం 9 రన్స్‌కే వెనుదిరిగాడు. ఇక ఆ తర్వాత కోహ్లీ, రోహిత్‌లు రెండు వికెట్‌కు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మరోసారి కోహ్లీ తన క్లాసిక్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కోహ్లీ, రోహిత్‌లు రెండో వికెట్‌కు 73 రన్స్ జోడించారు.
ఇక మూడవ వికెట్‌కు కోహ్లీ, సూర్యకుమార్‌లు అజేయంగా 106 రన్స్ జోడించారు. విరాట్ కోహ్లీ వరుసగా రెండవ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కోహ్లీ 44 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 62 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ కూడా భారీ షాట్లతో అలరించాడు. అతను వేగంగా స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. సూర్యకుమార్ కేవలం 25 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 51 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు.