కాఠ్మాండూ: నేపాల్ వరదల తర్వాత యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న సహాయక చర్యలు ఇంకా సజీవంగా ఉన్నవారిని రక్షిస్తున్నాయి. శనివారం నువాకోట్ జిల్లాలోని ఓ జల విద్యుత్తు సొరంగంలో లుహైతాయో అనే చైనా కార్మికుడిని, శిథిలమైన ఇంటి నుంచి చంద్రిక శ్రేష(్ట60) అనే మహిళను రెస్క్యూ సిబ్బంది రక్షించారు. మెరుగైన వైద్యం కోసం వారిద్దరిని కాఠ్మాండూకు తరలించారు. చైనా కార్మికుడిని సొరంగంలో 225 మీటర్ల లోపల గుర్తించారు. నాలుగు అంతస్తుల తన ఇంట్లో పై అంతస్తులో చంద్రిక అచేతనంగా పడి ఉండటాన్ని గమనించి ఆమెను కాపాడారు. మరోవైపు ఇప్పటికీ 5300 మంది వరదల్లో గల్లంతైనట్టు అధికారులు ప్రకటించారు. వీరిలో 275 మంది భారతీయలు ఉన్నారు. వరదల వల్ల 32 వేల మందికి పైగా ప్రభావితులయ్యారు.