న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: దేశవ్యాప్తంగా ఆటో విడిభాగాలకు డిమాండ్ లేకుండా పోయింది. విడిభాగాల తయారీ సంస్థల వద్ద రూ.98 వేల కోట్ల విలువైన ఇన్వెంటరీ నిలిచిపోయిందని సర్వేలో వెల్లడిస్తున్నాయి. దీంట్లో ఇన్వెంటరీ నిర్వహణను మెరుగుపర్చడం ద్వారా రూ.29-30 వేల కోట్ల వరకు నిధులను తిరిగిపోందే అవకాశాలున్నాయని వెక్టర్ కన్సల్టింగ్ గ్రూపు తన తాజా నివేదికలో వెల్లడించింది. దేశంలో ఆటో విడిభాగాల తయారీదారుల్లో దాదాపు 80 శాతం వాటా కలిగిన ఎంఎస్ఎంఈ వ్యవస్థలో రూ.4 వేల కోట్ల నుంచి రూ.5,600 కోట్ల వరకు మూలధనం విడుదలయ్యే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. దేశవ్యాప్తగా 21 సీనియర్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ల నుంచి జూలై నుంచి ఆగస్టు చివరి వరకు సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. దేశాయ ఆటోమోటివ్ కంపొనెంట్ ఎంఎస్ఎంఈల టర్నోవర్ రూ.2.4 లక్షల కోట్ల నుంచి రూ.2.9 లక్షల కోట్ల స్థాయిలో ఉన్నదని పేర్కొన్నది.