ఎండకు ట్యాన్ అయితేనే కాదు మృతకణాలు చర్మంలోనే ఎక్కువ కాలం ఉండిపోయినా చర్మం కాంతిహీనంగా మారిపోతుంది. కేవలం నీళ్లు తాగడం, పండ్లు తినే చిట్కాలతో ఈ స్థితిలో ఉన్న చర్మం అందంగా కనిపించదు. అసలు సమస్యను తొలగించుకోవాల్సిందే! అందుకోసం ఫేస్‌ప్యాక్‌తో చర్మంలోని డెడ్సెల్స్ని తొలగించుకోవాలి. కెమికల్ ఫేస్ ప్యాక్‌ల కంటే ఇంట్లోనే ఇలాంటివి తయారు చేసుకుంటే ఖర్చు తక్కువ. చర్మంపై దుష్ప్రభావం కూడా ఉండదు.
వంట గదిలో ఉండే శనగ పిండి ఒక చెంచాడు తీసుకుని, దానికి ఒక చెంచాడు గంధపు పొడిని కలపాలి. వీటిలో చిటికెడంత పసుపు చల్లి, ఒక నిమ్మ చెక్క పిండాలి. వీటన్నిటినీ కలిపిన తర్వాత ఒక గరిటెడు గడ్డ పెరుగుని వేసి కలుపుకోవాలి. గట్టిగా ఉండే పేస్ట్ తయారవుతుంది. ఇది ముఖానికి రాసుకునేందుకు అనుకూలంగా మారేలా పాలు కలుపుతూ పల్చగా చేసుకోవాలి. తర్వాత ముఖానికి ఐప్లె చేసుకోవాలి. ఓ అరగంట తర్వాత ఫేస్‌ప్యాక్ లేయర్‌ని తొలగిస్తుంటే దానితోపాటే మృతకణాలు కూడా పోతాయి. చర్మం కొత్త కాంతిని సంతరించుకుంటుంది.