Nepal Floods: నేపాల్ వరదల్లో 469కి చేరిన మృతుల సంఖ్య.. తాత్కాలిక సరస్సు వద్ద 2 మిలియన్ల క్యూబిక్ మీటర్ల నీరు
Nepal Floods: నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతిచెందిన వారి సంఖ్య 469కి చేరుకున్నట్లు ఆ దేశ పోలీసులు వెల్లడించారు. వరదల వల్ల సుమారు 1500 మంది ఆచూకీ లేనట్లు కూడా తెలిపారు. ఇక మరో వైపు చైనా వార్నింగ్ ఇచ్చింది. మళ్లీ దిగువ ప్రాంతాలకు మరింత భీకర వరదలు సంభవించే అవకాశాలు ఉన్నట్లు డ్రాగన్ దేశం హెచ్చరించింది.
కాట్మాండు: నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరద(Nepal Floods)ల్లో మృతిచెందిన వారి సంఖ్య 469కి చేరుకున్నట్లు ఆ దేశ పోలీసులు వెల్లడించారు. వరదల వల్ల సుమారు 1500 మంది ఆచూకీ లేనట్లు కూడా తెలిపారు. ఇక మరో వైపు చైనా వార్నింగ్ ఇచ్చింది. మళ్లీ దిగువ ప్రాంతాలకు మరింత భీకర వరదలు సంభవించే అవకాశాలు ఉన్నట్లు డ్రాగన్ దేశం హెచ్చరించింది. తాజా వరదల్లో సుమారు 178 మంది భారతీయులు గల్లంతు అయినట్లు నేపాల్ అధికారులు చెబుతున్నారు. 11 మందిని రెస్క్యూ చేశారు. విదేశీ పర్యాటకులతో పాటు మానస సరోవర యాత్రకు వెళ్లిన యాత్రికులు ఎక్కువ సంఖ్యలో మిస్ అయినట్లు తెలుస్తోంది.
టిబెట్-నేపాల్ బోర్డర్ వద్ద లెవల్-4 హెచ్చరిక జారీ చేసింది చైనా. బుధవారం నాటి మట్టిచరియలు విరిగిపడిన ఘటన తర్వాత తాత్కాలిక సరస్సులు ఏర్పడినట్లు చైనా చెప్పింది. రెండు నదుల సంగమం వద్ద ఇలా జరిగినట్లు ఆ దేశం పేర్కొన్నది. అయితే ఏ క్షణమైనా ఆ తాత్కాలిక సరస్సు ఉప్పొంగే అవకాశాలు ఉన్నట్లు చైనా అభిప్రాయపడింది. టిబెట్ ఆటోనమస్ ప్రాంతంలో చైనా జలవనరుల మంత్రిత్వశాఖ ఎమర్జెన్సీ ఆదేశాలు జారీ చేసింది. చోచెన్ ఖోలా, పెరుపా సాంగో నదుల కలయిక వద్ద భారీగా బేరియర్ లేక్ ఏర్పడినట్లు చైనా పేర్కొన్నది. ఈ రెండు నదులూ టిబెట్‌లో ఉద్భవిస్తాయి. ఇవి నేపాల్‌లోకి ప్రవేశిస్తాయి. అక్కడ నుంచి బోటే కోసిగా ఈ నదులు రూపాంతరం చెందుతాయి.
అయితే ఈ రెండు నదుల సంగమం వద్ద సుమారు రెండు మిలియన్ల క్యూబిక్ మీటర్ల మేర నీరు ఉన్నట్లు చైనా చెబుతోంది. దీంతో పెను ప్రమాదం పొంచి ఉన్నట్లు చైనా హెచ్చరించింది. ఆ ముప్పు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేపడుతున్నారు. ఆ తాత్కాలిక సరస్సు వల్ల రెస్క్యూ చర్యలు ఆలస్యం అవుతున్నాయి. ఎప్పుడు ఆ సరస్సు ఉప్పొంగుతుందో అన్న భయం నెలకొన్నది. బురదతో కొట్టుకువచ్చిన బండరాళ్లు అడ్డుపడడంతో.. రెండు నదుల సంగమం వద్ద భారీగా ఓ సరస్సు ఏర్పడింది. దీని వల్ల ముప్పు ఉందని భావిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

