న్యూఢిల్లీ : భారత్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులందరికీ కొవిడ్ ఆర్టీపీసీఆర్ నెగెటివ్ తప్పనిసరి కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం స్పష్టం చేసింది. ఇతర దేశాల నుంచి భారత్‌కు వచ్చే వారంతా నెగెటివ్ రిపోర్ట్ నివేదికను సమర్పించాల్సి ఉంటుందని, సర్టిఫికెట్ ఇవ్వకుంటే విమానంలోకి అనుతించవద్దని విమానయాశ్రయ అధికారులను ఆదేశించింది. ప్రయాణికులంతా ఆరోగ్య మంత్రిత్వ శాఖ సెల్ఫ్ డిక్లరేషన్ ఫారమ్ (SDF) నింపి, ప్రయాణానికి ముందు ఆన్లైన్ ఎయిర్ సువిధ పోర్టల్‌లో (www.newdelhiairport.in) సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రయాణానికి 72 గంటల ముందు తీసుకున్న కొవిడ్ టెస్ట్ రిపోర్ట్‌ను సైతం అప్లోడ్ చేయాల్సి స్పష్టం చేసింది.
నిబంధనలు పాటించకుంటే క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు బాధ్యులవుతారని హెచ్చరించింది. ‘ఏ’ కేటగిరి దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు టీకా సర్టిఫికెట్‌ను పోర్టల్‌లో అప్డేట్ చేయాలని, ప్రయాణికులందరూ తమ మొబైల్లో ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. పోర్టల్‌లో సెల్ఫ్ డిక్లరేషన్, కరోనా నెగెటివ్ రిపోర్ట్ అప్లోడ్ చేసిన ప్రయాణికులకు మాత్రమే విమానయాన సంస్థలు బోర్డింగ్‌కు అనుమతి ఇవ్వనున్నారు. విమానం ఎక్కే సమయంలో థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు సైతం చేయనున్నారు. గతంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. యూకే నుంచి మాత్రమే ప్రయాణికులకు మాత్రమే నెగెటివ్ ఆర్టీ పీసీఆర్ రిపోర్ట్‌ను నిర్ధారించాలని విమానయాన సంస్థలకు కేంద్రం ఆదేశాలున్నాయి.
Negative RT-PCR test report mandatory for all international passengers coming to India: Ministry of Health pic.twitter.com/8sdfmCpC9K
— ANI (@ANI) October 20, 2021