రామగిరి, నవంబర్ 04 : గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ & గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నల్లగొండ జిల్లాకు చెందిన నీరుడు దయాకర్‌రెడ్డి నియమితులయ్యారు. గాంధీజీ సంస్థల చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్ గాంధీ భవన్‌లోని సంస్థ కేంద్ర కార్యాలయంలో నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. గాంధీజీ సిద్ధాంతాలు నేటి తరానికి ఎంతో అవసరమన్నారు. ముఖ్యంగా సహజ వనరులను సంరక్షించుకుంటూ, సత్యం, అహింసా మార్గంలో ప్రతి ఒక్కరు జీవించినట్లైతే దేశం శాంతియుతంగా, సుస్థిర అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ సంస్థల వైస్ చైర్మన్ డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాలసాని సంజయ్ రెడ్డి, ప్రచార కార్యదర్శి కె.సుభాష్ చంద్ర, విగ్రహాల కమిటీ వైస్ ప్రెసిడెంట్ పి.శ్రీనివాస్ గౌడ్, యువజన విభాగం ఉపాధ్యక్షుడు వి.సంతోష్ రెడ్డి పాల్గొన్నారు.