Commonwealth Games : ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా (Neeraj Chopra) అంచనాలు అందుకుంటూ కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. గ్లాస్గో వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో గురువారం జరిగిన జావెలిన్ అర్హత రౌండ్లో సత్తా చాటిన చోప్రా ఐదో స్థానంలో నిలలిచాడు. అతడితో పాటు ఆకట్టుకున్న మరో ఇద్దరు భారత అథ్లెట్లు యశ్ వీర్ సింగ్, రోహిత్ యాదవ్‌లు సైతం ఫైనల్లో అడుగుపెట్టారు. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ శ్రీలంకకు చెందిన రుమేశ్ పథిరగ ఈటెను 82.84 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానం సాధించాడు.
కామన్వెల్త్ క్రీడల్లో జావెలిన్ త్రో పోటీ ఆసక్తి రేపుతోంది. గురువారం జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్లో ముగ్గురు భాతర అథ్లెట్లు ఫైనల్ చేరారు. రెండుసార్లు ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రాతో పాటు యశ్ వీర్ సింగ్, రోహిత్ యాదవ్‌లు పతక వేటకు అర్హత సాధించారు.
Neeraj Chopra books his place in the Men’s Javelin Final with a 79.61m throw despite challenging conditions. 👏
Watch the Golden Boy in action on 1st August, 12:45 AM onwards, LIVE on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #Glasgow2026… pic.twitter.com/M4kYPIuCTJ
— Sony Sports Network (@SonySportsNetwk) July 30, 2026
చోప్రా 79.61 మీటర్ల దూరం ఈటెను విసరగా.. 78.37 మీటర్లకు పరిమితమైన రోహిత్ 9వ స్థానంతో, యశ్ (78.36 మీటర్లు) పదో ప్లేస్‌తో ఫైనల్ చేరారు. పారిస్ ఒలింపిక్స్‌లో 90 మీటర్ల మార్క్ అందుకొని స్వర్ణం ఎగరేసుకుపోయిన అర్షద్ నదీమ్(పాకిస్థాన్) సైతం 73.63 మీటర్లతో క్వాలిఫై అయ్యాడు. అయితే.. నేరుగా అర్హతకు నిర్దేశించిన 84 మీటర్ల దూరం ఏ ఒక్కరూ అందుకోలేదు. ఆగస్టు1వ తేదీ, శనివారం ఫైనల్ జరుగనుంది.