
మేడ్చల్ రూరల్, నవంబర్ 19 : విద్యార్థులు ఇంజినీరింగ్లో చేరిన మొదటి ఏడాది నుంచే పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని వక్తలు పేర్కొన్నారు. గౌడవెల్లి గ్రామ పరిధిలోని హితం ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఓరియంటేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎక్సలెన్స్ సీఈవో సూర్య, పద్మశ్రీ రిటైర్డ్ ప్రొఫెసర్ సంజయ్ దాండి మాట్లాడుతూ విద్యార్థులు తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి అవకాశాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయన్నారు. పుస్తక పరిజ్ఞానంతో పాటు అనుబంధ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. తల్లిదండ్రుల ఆకాంక్షలను, కష్టాన్ని గుర్తించి, సన్మార్గంలో నడవాలని సూచించారు.