న్యూఢిల్లీ : మొఘల్ పాలకులు బాబర్, అక్బర్, ఔరంగజేజ్ కిరాతక సామూహిక హంతకులు, దేవాలయాల విధ్వంసకులు అని తాజాగా విడుదలైన ఎనిమిదో తరగతి టెక్స్ పుస్తకాలు చెప్తున్నాయి. వీటిని ఎన్సీఈఆర్టీ విడుదల చేసింది. పాఠశాల విద్య కోసం జాతీయ పాఠ్య ప్రణాళిక, 2023లో భాగంగా ఈ పుస్తకాలను రూపొందించారు.
భారత్లో మొఘలు సామ్రాజ్యాన్ని స్థాపించిన బాబర్ అత్యంత కిరాతక, క్రూర విజేత అని, ఆయన సామూహిక హత్యాకాండకు పాల్పడ్డాడని తెలిపారు. అక్బర్ పాలనలో కిరాతక చర్యలతోపాటు సహనం ఉండేదని పేర్కొన్నారు.