మేడ్చల్ రూరల్, డిసెంబర్ 1 : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు మూడేండ్ల పాటు జాతీయ అక్రిడేషన్ బోర్డు (ఎన్బీఏ) టియర్-1 గుర్తింపు లభించింది. కళాశాలలోని ఐదు ఇంజినీరింగ్ విభాగాలకు ఈ గుర్తిం పు లభించింది. ఈ విషయాన్ని కళాశాల కార్యదర్శి చామకూర మహేందర్రెడ్డి, డైరెక్టర్ రామస్వామిరెడ్డి బుధవారం వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఐదేండ్ల యూజీసీ స్వయంప్రతిపత్తి హోదా, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్, మైక్రోసాఫ్ట్ కృత్రిమ మేథ ప్రాజెక్టు కింద రూ.కోటి విడుదల, మార్గదర్శన్ పథకం కింద ఏఐసీటీఈ నుంచి రూ.50 లక్షల విడుదల, తదితర ఎన్నో విజయాలను కళాశాల సొంతం చేసుకుందన్నారు. ఇందుకోసం కృషి చేసిన డాక్టర్ యోగేశ్, శిల్పతో పాటు అధ్యాపకులు, సిబ్బందికి మంత్రి చామకూర మల్లారెడ్డి అభినందనలు తెలిపారు.