లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, చిచోరే చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్ చేసి..ఆ తర్వాత ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు యువ నటుడు నవీన్ పొలిశెట్టి. ఈ కుర్ర హీరో ఇపుడు జాతిరత్నాలు సినిమాతో ఈ ఏడాది టాలీవుడ్‌కు మంచి బ్రేక్ ఇచ్చాడు. మూవీ విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందనతో జాతిరత్నాలు సినిమా కోసం పడ్డ కష్టాలను మరిచిపోయి సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నాడు నవీన్.
సినిమాలు వద్దన్న తల్లిదండ్రులే జాతిరత్నాలు కోసం నవీన్ పడ్డ కష్టం చూసి బావోద్వేగానికి లోనయ్యారు. అమ్మానాన్నలు నవీన్‌ను హగ్ చేసుకుని ప్రశంసించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అనుదీప్ కేవీ డైరెక్ట్ చేసిన జాతిరత్నాలు చిత్రం రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, నవీన్ పొలిశెట్టి కామెడీ టచ్‌తో ఫన్ ఎంటర్ టైనర్ గా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ సూపర్‌హిట్ టాక్ తో ప్రదర్శించబడుతోంది. నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ మూవీతో ఫరియాఅబ్దుల్లా సిల్వర్ స్క్రీన్కు పరిచయమైంది.
After the super success of the Telugu movie #jaathirathnalu, @NaveenPolishety shares emotional moments with his parents. #NaveenPolishetty pic.twitter.com/yzlVje4AL9
— Johnson PRO (@johnsoncinepro) March 13, 2021
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.