హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ సబ్‌జూనియర్ త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలికల జట్టు విజేతగా నిలిచింది. సఫీల్గూడలో సోమవారం జరిగిన టోర్నీ ఫైనల్లో తెలంగాణ 15-9, 15-8 తేడాతో ఢిల్లీపై అద్భుత విజయం సాధించింది.
బాలుర తుదిపోరులో ఢిల్లీ 15-12, 15-9తో కర్ణాటకపై గెలిచి టైటిల్ దక్కించుకుంది. స్థానిక ఎమ్మెల్యే హన్మంతరావు విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నవీన్‌యాదవ్, కమల్ గోస్వామి, జగన్మోహన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.