ఢిల్లీ: మైనర్ షూటర్‌పై లైంగికదాడికి యత్నించాడనే ఆరోపణలతో భారత షూటింగ్ కోచ్ అంకుశ్ భరద్వాజ్‌పై వేటు పడింది. మొహాలీకి చెందిన 17 ఏండ్ల షూటర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫరీదాబాద్‌లో అంకుశ్‌పై ఎఫ్ఐఆర్ నమోదైనట్టు జాతీయ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) ధృవీకరించింది. ఎఫ్ఐఆర్ వివరాల ప్రకారం.. నిరుడు ఆగస్టు నుంచి అంకుశ్ వద్ద శిక్షణ పొందుతున్న బాధిత షూటర్‌ను గత నెలలో నేషనల్ చాంపియన్‌షిప్స్ అని పిలిపించిన అతడు ఆమెపై ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
ఆమె ఆటతీరును అంచనా వేయాలని పిలిచిన అంకుశ్.. మైనర్‌ను హోటల్ రూమ్‌కు తీసుకెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం గురించి బయట ఎవరికైనా చెప్తే ఆమె కెరీర్‌ను నాశనం చేస్తానని బెదిరించాడు. అయితే బాధితురాలు తన తల్లిదండ్రులతో విషయం చెప్పగా వాళ్లు పోలీసులకు అధికారికంగా ఫిర్యాదుచేయడంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో విచారణ పూర్తయ్యేదాకా అంకుశ్‌పై వేటు వేస్తున్నట్టు ఎన్ఆర్ఏఐ తెలిపింది.