ఇచ్చోడ, డిసెంబర్ 3డి ల్లీలో ఈనెల 26 నుం చి 29వ తేదీ వరకు జరిగిన ఇంటర్నేషనల్ ఆర్ట్స్ ఫెస్టివల్లో రాష్ట్రం తరపున సౌత్ సెంట్రల్ జోన్ కల్చర్ సెంటర్ వారి ఆధ్వర్యంలో మండలంలోని దుబార్పేట్కు చెందిన ప్రముఖ ఆదివాసీ కళాకారుడు కాత్లే శ్రీధర్ గుస్సాడీ బృందం పాల్గొన్నది. కార్యక్రమంలో గుస్సాడీ నృత్యం చేసి నేషనల్ అవార్డుతో పాటు ప్రశంసా పత్రాలను అందుకున్నారు. కార్యక్రమంలో జపాన్, మలేషియా, మా రిషస్, శ్రీలంక హంగేరి దేశాల కళాకారులతోపా టు మన దేశంలోని పలు రాష్ర్టాల కళాకారులు పా ల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. తనను ప్రోత్సహించిన తెలంగాణ రాష్ట్ర భాషా సంస్కృతి వారికి, ఆదివాసీ ప్రతిభను పలు దేశాల వారు గుర్తించేలా చేసేందుకు వేదిక కల్పించిన సౌత్ సెంట్రల్ జోన్ కల్చర్ సెంటర్ వారికి తన హృదయపూర్వక ప్రత్యే క ధ న్యవాదాలన్నారు. అవార్డును తెలంగాణలోని ఆదివాసులందరికీ అంకితం చేస్తున్నానని తెలిపారు.