SRH vs RCB : ఉప్పల్ స్టేడియంలో దంచుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) కు షాక్.. ఏడు ఓవర్లకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. తొలుత ఆ తర్వాతి ఓవర్లో మార్కండే సూపర్ డెలివరీతో విల్ జాక్స్(6)ను బౌల్డ్ చేశాడు. దాంతో, 65 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్ పడింది. రజత్ పాటిదార్ క్రీజులోకి వచ్చాడు.
అంతకుముందు బౌండరీలతో చెలరేగుతున్న ఓపెనింగ్ జోడీని నటరాజన్ విడదీశాడు. డేంజరస్ ఫాఫ్ డూప్లెసిస్(25)ను ఊరించే బంతితో బోల్తా కొట్టించాడు. దాంతో, 48 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ పడింది. వికట్ పడినా సరే బెంగళూరు జోరు తగ్గలేదు. ఓపెనర్ విరాట్ కోహ్లీ 32 పరుగులతో ఆడుతున్నాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆర్సీబీకి ఓపెనర్లు శుభారంభమిచ్చారు. తొలి ఓవర్లో 10 పరుగులే వచ్చినా.. భువనేశ్వర్, కమిన్స్ బౌలింగ్లో కోహ్లీ, డూప్లెసిస్లు దంచారు. దాంతో బెంగళూరు స్కోర్ 3 ఓవర్లకే 40 దాటింది. ఈ జోడీని విడదీసేందుకు కమిన్స్.. నట్టూను రంగంలోకి దించి ఫలితం రాబట్టాడు.