పుణె: భారత్‌తో జరుగుతోన్న మూడో వన్డేలో ఇంగ్లాండ్ కీలక వికెట్ కోల్పోయింది. రెండో వన్డేలో శతక సమాన ఇన్నింగ్స్‌తో చెలరేగిన స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్(35) నిర్ణయాక మూడో వన్డేలో తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. 11వ ఓవర్లో నటరాజ్ వేసిన ఫుల్‌టాస్ బంతిని భారీ షాట్ ఆడిన స్టోక్స్ డీప్ మిడ్వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న ధావన్ చేతికి చిక్కాడు. ప్రమాదకరంగా మారుతున్న స్టోక్స్‌ను ఔట్ చేసిన టీమ్ఇండియా మ్యాచ్‌పై పట్టు సాధించింది. 12 ఓవర్లకు ఇంగ్లాండ్ 3 వికెట్లకు 76 పరుగులు చేసింది. ప్రస్తుతం డేవిడ్ మలన్(17), జోస్ బట్లర్(3) క్రీజులో ఉన్నారు.
England 3⃣ down! 👍👍@Natarajan_91 gets Ben Stokes out & gives #TeamIndia a big breakthrough 👌👌@Paytm #INDvENG
— BCCI (@BCCI) March 28, 2021
Follow the match 👉 https://t.co/wIhEfE5PDR pic.twitter.com/CGR0LtckXE