హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): వైద్యవిద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్టు (నీట్) ఫలితాల్లో జాతీయస్థాయి అన్ని క్యాటగిరీల్లో టాప్ టెన్‌లో 2, 3, 4, 8, 9 (ఐదు) ర్యాంకులను తమ విద్యార్థులు కైవసం చేసుకున్నట్టు నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు పీ శరణినారాయణ, డాక్టర్ పీ సింధూర నారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వందలోపు 19 ర్యాంకులు సాధించి అగ్రగామిగా నిలిచామని పేర్కొన్నారు. నారాయణ ఎన్-40 ప్రోగ్రాం ద్వారా నీట్లో పోటీని తట్టుకొని టాప్ ర్యాంకులు కైవసం చేసుకున్నట్టు వెల్లడించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు, బోధన, బోధనేతర సిబ్బందికి అభినందనలు తెలియజేశారు.