Prathinidhi-2 Movie | బాణం, సోలో, ప్రతినిధి, రౌడీ ఫేల్లో, అసుర వంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసి జనాల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు యంగ్ హీరో నారా రోహిత్(Nara Rohit). చివరగా ఆయన ఐదేళ్ల కిందట వచ్చిన వీర భోగ వసంత రాయలు (Veera Bhoga Vasantha rayalu) సినిమాలో కనిపించాడు. అయితే చాలా గ్యాప్ తరువాత నారా రోహిత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రతినిధి-2’ (Prathinidhi-2). మూర్తి దేవగుప్తపు దర్శకుడు (Journalist Murthy).
తొమ్మిదేళ్ల కిందట నారా రోహిత్ రోహిత్ హీరోగా చేసిన సినిమా ప్రతినిధి. ఈ మూవీ సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్‌గా పెద్దగా సక్సెస్ కాకపోయిన.. బుల్లితెరపై మాత్రం సంచలనాలు సృష్టించింది. అయితే ఇప్పుడదే సినిమా సీక్వెల్‌తో వస్తున్నాడు. ఇప్పటికే.. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్ తాజాగా కాన్సెప్ట్ టీజర్(Prathinidhi-2 Concept video)ను వదిలారు. మరోసారి ఓ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ థ్రిల్లర్‌ని అయితే మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా ఈ కాన్సెప్ట్ టీజర్ చూస్తే అర్ధం అవుతుంది.
ఇక టీవీ-5 సీనియర్ జర్నలిస్ట్ మూర్తి ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. ఏపిలో రానున్న ఎన్నికల దృష్ట్యా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ఇన్సైడ్ టాక్. అంతేకాకుండా వీలైనంత త్వరగా షూటింగ్‌ను కంప్లీట్ చేసి ఎన్నికల ముందే సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్‌లో ఉన్నారట. వానరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీతోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తుండగా.. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.
Behold the delightful surprise! Here is the Concept Video of #Pratinidhi2. @idealdots has done an exceptional job in crafting this video, while @SagarMahati‘s music adds the perfect touch of brilliance. @murthyscribe @VanaraEnts https://t.co/oDfDIlBFbk
— Rohith Nara (@IamRohithNara) July 25, 2023