Nani- Sekhar Kammula | టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులకి మంచి వినోదం పంచుతున్న విషయం తెలిసిందే. ఆయన తెరకెక్కించిన ప్రతి చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లే రాబట్టింది. ఇటీవల కుబేర అనే చిత్రంతో పలకరించాడు. ఈ మూవీ కూడా మంచి విజయం సాధించింది. ఇక ఇప్పుడు నానితో ఓ ప్రాజెక్ట్ చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నేచురల్ స్టార్ నాని తన కెరీర్‌ను వైవిధ్యంగా మలుస్తున్నాడు. ప్రేమకథలతో, కుటుంబ డ్రామాలతో ప్రేక్షకుల మనసు దోచిన నాని, ఇటీవల ‘హిట్ 3’లాంటి డార్క్ యాక్షన్ థ్రిల్లర్‌తో వైవిధ్యాన్ని చూపించాడు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడనే వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
ఇటీవలే ‘కుబేర’ మూవీతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన శేఖర్ కమ్ముల, నానితో కలిసి ఎలాంటి కథను సినిమాగా తీయబోతున్నారా అనే ఆసక్తి పెరుగుతోంది. వీరిద్దరి కాంబినేషన్లో ఇది తొలి సినిమా కావడం, ఇద్దరికీ భిన్నమైన ఫాలోయింగ్ ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అప్పుడే హైప్ క్రియేట్ అయింది. ఈ మూవీలో హీరోయిన్గా సాయిపల్లవి పేరు వినిపిస్తుంది. ఇది నిజమైతే, ఇది నాని – సాయిపల్లవి జోడీకి మూడో సినిమా అవుతుంది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన ‘ఎంసీఏ’ (2017), ‘శ్యామ్ సింగరాయ్’ (2021) మంచి విజయం సాధించాయి. ప్రేక్షకుల నుంచి హిట్ పెయిర్‌గా గుర్తింపు కూడా పొందారు. శేఖర్ కమ్ములకు సాయిపల్లవి ఫేవరెట్ హీరోయిన్. ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ఫిదా’ ఆమెకు స్టార్డమ్ తీసుకొచ్చింది.
ఆ తర్వాత ‘లవ్‌స్టోరీ’ కూడా మంచి స్పందన తెచ్చుకుంది. తెలంగాణ యాసలో సాయిపల్లవి చెప్పిన డైలాగులు ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు అదే దర్శకుడు, అదే హీరోయిన్, కొత్తగా నానితో జత కట్టడం విశేషం. సాయిపల్లవి ఇటీవలే నాగచైతన్యతో నటించిన ‘తండేల్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకుంది. ఇప్పుడు బాలీవుడ్లో రూపొందుతున్న భారీ మైథాలజికల్ మూవీ ‘రామాయణ’ లో సీత పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా నటించగా, 2026 లేదా 2027 దీపావళికి రిలీజ్ చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే నాని – శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.