Nani | టాలీవుడ్లో మరో ఫ్రెష్ జోడి స్క్రీన్‌పై కనిపించి సందడి చేయనుంది. పవన్ కళ్యాణ్‌కు ఓజీ (OG) వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన దర్శకుడు సుజీత్ తన తదుపరి ప్రాజెక్ట్‌పై పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నారు. ఈసారి నేచురల్ స్టార్ నాని హీరోగా చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, ఆయన సరసన పూజా హెగ్డేను కథానాయికగా ఎంపిక చేసినట్లు సమాచారం. నాని – పూజా హెగ్డే కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా ఇదే కావడంతో టాలీవుడ్లో ఆసక్తి చెలరేగింది. వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉండబోతోందన్నది అభిమానుల్లో చర్చనీయాంశమైంది.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను శ్యామ్ సింగరాయ్, సైంథవ్ వంటి సినిమాలను నిర్మించిన నిర్మాత వెంకట్ బోయపల్లి నిర్మిస్తున్నారు. ఇందులో పాన్-ఇండియా స్టార్, మలయాళ సూపర్‌స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది. దీపావళి తర్వాత ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మొదట నాయికగా నేషనల్ క్రష్ రుక్మిణి వసంత్‌ను పరిశీలించినప్పటికీ, చివరకు మేకర్స్ పూజా హెగ్డేనే ఫైనల్ చేసినట్లు టాలీవుడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.సుజీత్ ఈ సినిమాను ఓజీ యూనివర్స్‌లో భాగంగా కాకుండా, ఒక స్టాండ్ అలోన్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నారు. ‘రన్ రాజా రన్’ తరహాలో యూత్‌ఫుల్, మాస్ ఎలిమెంట్స్‌తో నిండి ఉండే ఈ సినిమాకు తాత్కాలికంగా ‘బ్లడీ రోమియో (Bloody Romeo)’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం నాని ప్యారడైజ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉండగా, సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా 2026 తొలి అర్ధభాగంలో పూర్తి చేయాలని, అదే ఏడాది చివర్లో థియేటర్లలో విడుదల చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది. పూజా హెగ్డేకు ఇది తెలుగులో రీ-ఎంట్రీ ప్రాజెక్ట్‌గా మారబోతోంది. ప్రస్తుతం ఆమె దుల్కర్ సల్మాన్‌తో నటిస్తున్న మరో తెలుగు సినిమా షూటింగ్ కూడా వేగంగా సాగుతోంది. వరుస ప్రాజెక్ట్‌లతో తిరిగి హిట్ ట్రాక్‌లోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.