గుర్రంపోడు, నవంబర్ 22: అమెరికాలో రో డ్డు దాటుతుండగా కారు ఢీ కొని నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండ లం తెరాటిగూడెంకు చెందిన మండలి శేఖర్ (28) గురువారం మృతిచెందాడు. అమెరికా వెళ్లిన కొడుకు ఆర్థికంగా ఎదిగి వస్తాడని ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు శేఖర్ మృతివార్త తీరని విషాదాన్ని నింపింది. త్వరలో పెళ్లి చేద్దామనుకుంటున్నామని, అంతలోనే కొడుకు మృతి చెందడం పట్ల కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామానికి చెం దిన మండలి ముత్యాలు-కొముర మ్మ దంపతులకు నలుగురు కూతు ర్లు, ఇద్దరు కొడుకులు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ముత్యాలు.. కూతుర్లతోపాటు పెద్ద కొడుకు వెంకటేశ్వర్లుకు పెళ్లి చేశాడు. చిన్న కొడుకు శేఖర్.. 2018లో ఇటలీకి వెళ్లి ఎం బీఏ టూరిజం మేనేజ్మెంట్ పూర్తిచేశాడు. అనంతరం 2019లో అమెరికా వెళ్లాడు. అక్కడే ఎలికాన్ సిటీలో ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం రోడ్డు ప్ర మాదానికి గురై మృతిచెందాడు. తమ కొడుకు మృతదేహాన్ని త్వరగా తీసుకొచ్చేందుకు చొరవ తీసుకోవాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్‌కు శేఖర్ తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.