ఢిల్లీ : భారత యువ స్కాష్ ప్లేయర్ అనాహత్ సింగ్ సంచలన ప్రదర్శనతో సత్తాచాటింది. వాషింగ్టన్లో జరిగిన ‘స్కాష్ ఆన్ ఫైర్’ టోర్నీలో 17 ఏండ్ల ఈ ఢిల్లీ అమ్మాయి.. 3-0 (12-10, 11-5, 11-7)తో ప్రపంచ పదో ర్యాంకర్ జార్జినా కెన్నెడీ (ఇంగ్లండ్)కు షాకిచ్చి తన కెరీర్లో తొలి పీఎస్ఏ బ్రాంజ్ లెవల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
26 నిమిషాల్లోనే ముగిసిన ఫైనల్లో ప్రత్యర్థిని మట్టికరిపించిన అనాహత్‌కు.. తొలి గేమ్‌లో 8-10తో ఉన్నప్పటికీ తర్వాత పుంజుకుని దానిని గెలుచుకుంది. ఆ తర్వాత రెండు గేమ్స్‌లోనూ ఆమె జోరు ముందు కెన్నెడీ నిలువలేకపోయింది. ఇప్పటిదాకా 26 పీఎస్ఏ టూర్స్ టోర్నీల్లో ఆమెకు ఇది 15వ టైటిల్ కావడం విశేషం.