విజ్క్ ఆన్ జీ : ప్రతిష్టాత్మక టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టైటిల్ను ఉజ్బెకిస్థాన్ గ్రాండ్ మాస్టర్ నొదిర్బెక్ అబ్దుసతారోవ్ గెలుచుకున్నాడు. నెదర్లాండ్స్లో జరిగిన ఈ టోర్నీలో సోమవారం ముగిసిన 13వ రౌండ్లో అతడు.. తెలంగాణ కుర్రాడు అర్జున్ ఇరిగేసిని నల్లపావులతో ఓడించాడు.
దీంతో 9 పాయింట్లతో అగ్రస్థానాన నిలిచి టోర్నీ విజేతగా నిలిచాడు. టాప్-10లో భారత జీఎంగుకేశ్.. 6.5 పాయింట్లతో 8వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.