హైదరాబాద్, ఆట ప్రతినిధి : ఏషియన్ గేమ్స్ 2026 టెస్ట్ ఈవెంట్లో భారత సెపక్తక్రా టీమ్ పసిడి పతకంతో మెరిసింది. జపాన్ వేదికగా జరిగిన టోర్నీలో భారత పురుషుల జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది.
టోర్నీలో తమ కంటే బలమైన జట్లను ఓడిస్తూ ముందుకు సాగిన భారత్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆకాశ్ యుమ్నమ్, సందీప్‌కుమార్, అరుణ్, రామ్‌కుమార్, బాబీకుమార్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.