Ayush Mhatre : అండర్-19 వరల్డ్కప్ కెప్టెన్ ఆయుష్ మాత్రే(Ayush Mhatre) ఐపీఎల్లో అర్ధ శతకంతో మెరిశాడు. చెపాక్ స్టేడియంలో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన మాత్రే.. వేగవంతమైన హాఫ్ సెంచరీతో రికార్డు నెలకొల్పాడు. క్రీజులోకి పంజాబ్ కింగ్స్ బౌలర్లకు దడ పుట్టించిన ఈ కుర్రాడు.. నాలుగేసి ఫోర్లు, సిక్సర్లతో 29 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు. 19 ఏళ్లలోపే ఐపీఎల్లో అత్యధిక యాభైలు కొట్టిన మూడో ఆటగాడిగా మాత్రే రికార్డు సృష్టించాడు.
ఐపీఎల్లో కుర్రాళ్లు రికార్డుల మోత మోగిస్తున్నారు. ఆరంభ పోరులోనే వైభవ్ సూర్యవంశీ మూడో వేగవంతమైన అర్ధ శతకంతో రికార్డు నెలకొల్పగా.. ఈసారి ఆయుష్ మాత్రే 29 బంతుల్లోనే యాభై కొట్టేశాడు. తద్వారా19 ఏళ్లకు ముందే రెండేసి అర్ధ శతకాల వీరుడిగా అవతరించాడు. ఈ జాబితాలో వైభవ్ సూర్యవంశీ అగ్రస్థానంలో ఉన్నాడు.
Putting on a show and HOW 🍿
2⃣nd #TATAIPL FIFTY 🫡
Ayush Mhatre rising through the ranks in style 👌👌
Updates ▶️ https://t.co/riWrE2EZiF#KhelBindaas | #CSKvPBKS pic.twitter.com/Xt8cxzw8j2
— IndianPremierLeague (@IPL) April 3, 2026
గత సీజన్లో 14 ఏళ్ల సంచలనంగా 35 బంతుల్లోనే శతకంతో చరిత్ర లిఖించిన వైభవ్.. మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. పృథ్వీ షా, మాత్రే రెండుసార్లు అర్ధ శతకాలతో రికార్డు సాధించారు. 18 ఏళ్ల 261 రోజులు వయసున్న మాత్రే చెపాక్లో ఫిఫ్టీ బాదిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సొంతం చేసుకున్నాడు.