CSK vs PBKS : ఇటీవల పొట్టి ప్రపంచకప్‌లో వరసగా అర్ధ శతకాలతో అలరించిన సంజూ శాంసన్(7) ఐపీఎల్లో మాత్రం తడబడుతున్నాడు. తన కలల జట్టైన చెన్నై సూపర్ కింగ్స్ తరఫున దంచేయాలనుకున్న సంజూ అనూహ్యంగా చతికిలపడుతున్నాడు. వరల్డ్‌కప్‌లో పవర్ ప్లేలో ఉతికారేసిన ఈ పవర్ హిట్టర్.. కనీసం పది బతుల్ని తొలి మ్యాచ్‌లో ఆరు పరుగులకే క్లీన్ బౌల్డైన ఈ చిచ్చరపిడుగు.. రెండో మ్యాచ్‌లో 7 పరుగులకే వికెట్ ఇచ్చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఆయుష్ మాత్రే(29 నాటౌట్) బౌండరీలతో చెలరేగుతున్నాడు.
వరసగా రెండో మ్యాచ్‌లోనూ సంజూ శాంసన్ విఫలమయ్యాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో బార్ట్లెట్ సంధించిన బంతి ఎడ్జ్ తీసుకొని వికెట్ కీపర్ ప్రభ్‌సిమ్రన్ చేతుల్లో పడింది. అంతే.. మంచి ఇన్నింగ్స్‌తో అభిమానులకు పూనకాలు తెప్పించాలనుకున్న శాంసన్ కల చెదిరింది. వికెట్ పడినా ఆయుష్ మాత్రే(29 నాటౌట్) బౌండరీలతో అలరిస్తున్నాడు.
Ayush Mhatre motoring along! 🏎️
The youngster putting wheels to @ChennaiIPL‘s innings 🔥#CSK 57/1 after the Powerplay.
Updates ▶️ https://t.co/riWrE2EZiF#TATAIPL | #KhelBindaas | #CSKvPBKS pic.twitter.com/UyJtggrhxT
— IndianPremierLeague (@IPL) April 3, 2026
బార్ట్లెట్ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు బాదిన మాత్రే.. అనంతరం విజయ్‌కుమార్ బౌలింగ్‌లో సూపర్ సిక్సర్ బాదాడు. పవర్ ప్లే చివరి ఓవర్లో మాత్రే ఫోర్ రాబట్టగా సీఎస్కే.. 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 57 పరుగుల చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 14 రన్స్‌తో క్రీజులో ఉన్నాడు.