హైదరాబాద్, ఆట ప్రతినిధి : రానున్న ప్రతిష్టాత్మక ఐ-లీగ్ సీజన్ కోసం శ్రీనిధి దక్కన్ ఫుట్‌బాల్ క్లబ్(ఎస్‌డీఎఫ్‌సీ) పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నది. జట్టును మరింత పటిష్టంగా మలిచేందుకు టోగోలిస్కు చెందిన అంతర్జాతీయ డిఫెండర్ హాది ఇద్రోసౌను కొత్తగా జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని సోమవారం ఎస్‌డీఎఫ్‌సీ ఒక ప్రకటనలో పేర్కొంది.
టోగో అండర్-23 జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ 24 ఏండ్ల డిఫెండర్‌కు మెరుగైన అనుభవముంది. ప్రొఫెషనల్ పుట్బాలర్గా కెరీర్ ఆరంభించిన హాది..మొరాకోలోని టాప్ డివిజన్ క్లబ్‌లు డిఫా ఎల్ జదిదాతో పాటు అల్బేనియాలో ఎఫ్‌కే బైలిస్, యూరోపియన్ ఫుట్‌బాల్‌లోనూ ప్రాతినిధ్యం వహించాడు. హాది చేరికతో శ్రీనిధి టీమ్ డిఫెన్స్ మరింత పటిష్ఠంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.