చౌటుప్పల్ / మునుగోడు / మిర్యాలగూడ / చండూరు / సంస్థాన్ నారాయణపురం / మర్రిగూడ, అక్టోబర్ 8 : టీవీ చర్చావేదికలో బహిరంగంగా రూ.18వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చినందుకే తాను బీజేపీలో చేరానని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జిల్లావ్యాప్తంగా శనివారం నిరసనలు వెల్లువెత్తాయి.
ఈ సందర్భంగా టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు నిరసనలు తెలపడంతో పాటు, ఆయన దిష్టిబొమ్మలు దహనం చేశారు. చౌటుప్పల్ పట్టణంలోని బస్టాండ్ కూడలిలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు రాజగోపాల్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లబోతు భాస్కర్‌రావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు, సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, టీఆర్ఎస్ మున్సిపాలిటీ, మండలాధ్యక్షులు ముత్యాల ప్రభాకర్‌రెడ్డి, గిర్కటి నిరంజన్‌గౌడ్ పాల్గొన్నారు.
మునుగోడు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో డీసీఎంస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్, ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ మండలాధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి, సూర్యాపేట జడ్పీటీసీ జీడి.భిక్షం, తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల రాష్ట్ర అధ్యక్షుడు బండ ప్రకాశ్, తెలంగాణ యూన్సివర్సిటీ ఎగ్జిక్యూటీవ్ మెంబర్ మారయ్యగౌడ్, ఎంపీటీసీలు ఈద నిర్మల, శరత్‌బాబు, రావిరాల కుమారస్వామి, చండూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఏరుకొండ శ్రీనివాస్, ఏరుకొండ నాగరాజు, పెరుమాళ్ల ప్రణయ్, వివిధ గ్రామాల టీఆర్ఎస్ సర్పంచులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
మిర్యాలగూడ పట్టణంలో టీఆర్ఎస్ నాయకులు రాజగోపాల్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, నామిరెడ్డి యాదగిరిరెడ్డి, చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కుర్ర విష్ణు, యల్దండ లింగారెడ్డి, పెద్ది శ్రీనివాస్‌గౌడ్, మట్టపల్లి సైదులు, లక్ష్మీనారాయణ, సలీం, కరీం, ఎండీ. షోయబ్, పద్మయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.
చండూరు మండల కేంద్రంలో టీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపాయి. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బూతరాజు దశరథ, నాయకులు కోడి వెంకన్న, పున్న ధర్మేందర్, పున్న సైదలు, మోగుదాల వెంకన్న పాల్గొన్నారు. సంస్థాన్ నారాయణపురం మండలకేంద్రంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్), సీపీఐ, సీపీఎం నాయకులు రాజగోపాల్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండలాధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య, పీఏసీఎస్ చైర్మన్ జక్కడి జంగారెడ్డి, నాయకులు తెలంగాణ భిక్షం, చిలువేరు అంజయ్య, కొప్పు రామకృష్ణ, చిలువేరు శంకర్, మల్లరెడ్డి పాల్గొన్నారు.
మర్రిగూడ మండల కేంద్రంలోని చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పాశం సురేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దంటు జగదీశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోటకూరి శంకర్ యాదవ్, దళిత బంధు జిల్లా డైరెక్టర్ లఫంగి నర్సింహ, సహకార చైర్మన్ బాలం నర్సిం హ, సర్పంచ్ కల్లు స్వాతీనవీన్రెడ్డి, కుంభం నర్సమ్మామాధవరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఐతగోని వెంకటయ్యగౌడ్, ఉపాధ్యక్షులు ఎం.రామన్న, పి.పాం డుగౌడ్, పలువురు నాయకులు పాల్గొన్నారు.