మోత్కూరు, ఆగస్టు 27 : విద్యార్థులు క్రమ శిక్షణతో చదివి భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మోత్కూరు మున్సిపల్ చైర్ పర్సన్ తీపిరెడ్డి సావిత్రీమేఘారెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో 2021-22 విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన ప్రథమ, ద్వితీయ విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందజేసి మాట్లాడారు. దాతలు పోచం నారాయణ, కొణతం దామోదర్రాయుడు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం విద్యార్థులకు నగదు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు టీ అంజయ్య, పూర్వ విద్యార్థుల సంఘం ప్రధాన కార్యదర్శి సోమనర్సయ్య, ఎస్ఎంసీ చైర్మన్ జంగ పద్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
భువనగిరి కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి విద్యాశాఖతోపాటు విద్యార్థుల తల్లితండ్రులు సహకరించాలని మున్సిపల్ వైస్‌చైర్మన్ చింతల కిష్టయ్య అన్నారు. శనివారం పట్టణ పరిధిలోని రాయగిరి ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.పాఠ శాల అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం కావాలని సూచించారు. ఈ సమావేశానికి మొదట విచ్చేసిన ఇద్దరు తల్లిదండ్రులను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డాక్టర్ పోరెడ్డి రంగయ్య శాలువాలతో సన్మానించారు. సమావేశంలో కౌన్సిలర్ నాయిని అరుణా పూర్ణచందర్, ఎస్ఎంసీ చైర్మన్ సామల వెంకటేశం, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, మున్సిపల్ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిద్రండులు పాల్గొన్నారు.
భువనగిరి అర్బన్ : ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం ఆంగ్ల విద్యను ఈ ఏడాది నుంచే అందజేస్తున్నదని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చందూలాల్ అన్నారు. పట్టణంలోని బ్రహ్మణవాడప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి ఆంగ్ల బోధనపై చర్చించారు. విద్యార్థులను ఇంటి వద్ద చదువుకునేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని హెచ్ఎం సూచించారు. పాఠశాలలో ఏమైనా సమస్యలుంటే పరిష్కారానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ సల్మా, సామాజిక కార్యకర్త జయప్రకాశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.