ఇంటర్మీడియట్ సైన్స్, ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నేటి నుంచి జరుగనున్నాయి. నాలుగు విడుతల్లో ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 8 వరకు జరిగే పరీక్షలకు ఇంటర్ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 20,791మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షల పర్యవేక్షణకు డీఈసీ, హెచ్పీసీ, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేశారు.
రామగిరి, మార్చి 22 : ఇంటర్మీడియట్ సైన్స్, ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు బుధవారం నుంచి ఏప్రిల్ 8 వరకు జరుగనున్నాయి. ఈ విద్యా సంవత్సరం ఇంటర్మీడియేట్ బోర్డు ఆదేశాల మేరకు నాలుగు విడుతల్లో ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20,791 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. దాదాపుగా అన్ని కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా పరీక్షల విభాగం, హైపవర్ కమిటీతో పాటు ప్లయింగ్ స్కాడ్ బృందాలు పరీక్షలను పర్యవేక్షిస్తాయి. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు నిమగ్నమయ్యారు. నాలుగు విడుతలుగా ఏప్రిల్ 8లోగా ఈ పరీక్షలను పూర్తి చేయనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యా హ్నం 12 గం టల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
విద్యార్థుల హాజరు ఇలా…
నల్లగొండ జిల్లాలో 10,132మంది విద్యార్థులు ఒకేషనల్ విభాగంలో 5,253మంది(ప్రథమ సంవత్సరంలో 2,821, ద్వితీయ సంవత్సరంలో 2,432)హాజరవుతున్నారు. సూర్యాపేట జిల్లా 5, 730 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 4,929 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
ఏర్పాట్లు పూర్తి
ఇంటర్ ప్రాక్టికల్స్‌కు అన్ని ఏర్పాట్లు చేశాం. కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా ప్రాక్టికల్స్ నిర్వహించలేదు. తొలి విడుతలో 33 కళాశాలల్లో పరీక్షలు జరుగుతాయి. కేంద్రాలను ఏర్పా టు చేయడంతో పాటు విద్యార్థులకు మౌలిక వసతులు అందుబాటులో ఉంచాం. పరీక్షల విషయంలో విద్యార్థులకు ఏమైనా సమస్యలుంటే జిల్లా కంట్రోల్ రూమ్‌కు ఫోన్ నంబర్ 967659 0568, 9553188080 లో సంప్రదించాలి.
– దస్రూ, డీఐఈఓ నల్లగొండ