డిండి, మార్చి 22 : టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలు ప్రగతి పథంలో దూసుకు పోతున్నాయని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంతో పాటు బొగ్గులదొన, చెర్కుపల్లి, పెద్దతండా, బొల్లేపల్లి గ్రామాల్లో సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ సునీతాజనార్దన్రావు, జడ్పీటీసీ దేవేందర్‌రావు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు వెంకటేశ్వర్రావు, పీఏసీఎస్ చైర్మన్లు నాగార్జున్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ జంగారెడ్డి, సర్పంచులు సాయమ్మాకాశన్న, సుధామణీవెంకట్రెడ్డి, కవితాచంద్రయ్య, భాస్కర్, వెంకటేశ్, ఎంపీటీసీలు వెంకటయ్య, రాధిక, రజిత, మండల కోఆప్షన్ సభ్యుడు జహంగీర్, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్‌గౌడ్, గుర్రం రాములు, జి.శ్రీనివాసులు, సురేశ్, కలీం, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
ఘనంగా రథోత్సవం
మాల్ : చింతపల్లి మండలం గొడకొండ్లలోని మాల్ గుట్టపైన ఉన్న అలివేలు మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రథోత్సవం నిర్వహించారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ఉత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, ధూప, దీప నైవేధ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నదని అన్నారు. కమిటీ చైర్మన్ మల్లోజు జగన్‌చారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను సన్మానించారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంకణాల వెంకట్‌రెడ్డి, జడ్పీటీసీ కంకణాల ప్రవీణా సొంత నిధులు రూ.1.50 లక్షలతో గుట్టపై ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మండలంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కొండూరి భవానీపవన్కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ మల్లోజు జగన్‌చారి, సర్పంచ్ కొండూరి శ్రీదేవీశ్రీనివాస్, నాయకులు విద్యాసాగర్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, నరేందర్‌రావు, రంగారెడ్డి ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.