అధికార పార్టీకి కొమ్ము కాస్తూ..
మున్సిపల్ ఎన్నికల్లో పలుచోట్ల అధికార యంత్రాంగం అధికారపార్టీకి కొమ్ము కాయడం బాధాకరమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. 13వ తేదీన నిర్వహించే కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సింగిరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 23వ వార్డుకు చెందిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో నిరంజన్‌రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- బీఆర్ఎస్ నేతలను ఇబ్బంది పెడుతున్నారు
- పుర ఎన్నికల లెక్కింపు ప్రక్రియ పకడ్బందీగా చేయాలి
- మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
వనపర్తి, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికల్లో పలుచోట్ల అధికార యంత్రాంగం అధికారపార్టీకి కొమ్ము కాయడం బాధాకరమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. 13వ తేదీన నిర్వహించే కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సింగిరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 23వ వార్డుకు చెందిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో నిరంజన్‌రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అనంతరం అక్కడే ఉన్న మీడియాతో సింగిరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలోని పలుచోట్ల నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార యంత్రాంగం అధికార పార్టీకి అండగా ఉండి బీఆర్ఎస్ అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. కౌంటింగ్ ప్రక్రియలోనూ పకడ్బందీ ఏర్పాట్లు చేయాల ని నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొన్నిచోట్ల కౌంటింగ్‌లో అభ్యర్థుల కండ్ల ముందే పోలీసుల జులుంతో తప్పులు జరిగాయన్నారు. వీటి ఫలితంగా వనపర్తి నియోజకవర్గంలోని కొన్ని గ్రామ పంచాయతీల ఫలితాలు తారుమారు అయ్యాయని, వాటిపై న్యాయపోరాటం చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రజల అభిష్టానికి తగ్గట్లుగా నిర్భయంగా ఎన్నికల నిర్వహణ జరిగితేనే ప్రజాస్వామ్యానికి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
IL-76MD | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన రికార్డు.. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ఫ్లైట్ ల్యాండింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

