రాజాపేట, మే 8 : ఓయూ విద్యార్థులను అవమానిస్తూ మాట్లాడిన రేవంత్‌రెడ్డి తక్షణమే వారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యకుడు తుంగ బాలు డిమాండ్ చేశారు. మండలంలోని రఘునాథపురం గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెయింటర్‌గా జీవితం ప్రారంభించిన రేవంత్‌రెడ్డికి పాత రోజులు గుర్తుకొచ్చినట్లుందని అభిప్రాయపడ్డారు.
ఓయూ విద్యార్థులను అడ్డా కూలీలుగా వ్యాఖ్యానించిన రేవంత్‌కు వారు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన గొప్ప చరిత్ర ఓయూ విద్యార్థులదైతే, వారిది బెదిరించిన నీచ చరిత్ర రేవంత్‌రెడ్డిదని పేర్కొన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ యువజన విభాగం మండలాధ్యక్షుడు పల్లె సంతోష్‌గౌడ్, టీఆర్ఎస్ మండల కోశాధికారి కటకం స్వామి, మండల అధికార ప్రతినిధి ఎర్రగోకుల రాజు పాల్గొన్నారు.