CM Chandra Babu | హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు తన కాళ్లు మొక్కొద్దని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కోరారు. ఎవరైనా తన కాళ్లకు నమస్కరిస్తే తాను కూడా వారి కాళ్లకు నమస్కరించాల్సి ఉం టుందని పేర్కొన్నారు. ప్రజలతో కాళ్లకు నమసారం పెట్టించుకొనే సంస్కృతి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులు, గురువులు, దేవుడి కాళ్లకు మాత్రమే మొకాలని, నాయకులకు కాద ని పేర్కొన్నారు.
రాజకీయ నాయకులు కూడా ఈ సంస్కృతికి దూరంగా ఉండాలని సూచించారు. ఏపీ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్భవన్కు శనివారం వచ్చిన చంద్రబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కొందరు వినతిపత్రాలు సమర్పించి కాళ్లు మొక్కే ప్రయత్నం చేయగా, వారిని వారించారు. వినకుండా కాళ్లకు మొకితే.. తాను కూడా వాళ్ల కాళ్లకు మొకుతానని తెలిపారు. తన సూచనను, విజ్ఞప్తిని అందరూ అర్థం చేసుకొని సహకరించాలని సీఎం కోరారు.