మోడీ 3సార్లు ముఖ్యమంత్రిగా చేసి నేడు రెండో సారి ప్రధానిగా ఉన్నారని, ఆయన పాలించిన గుజరాత్ కన్నా అభివృద్ధిలో మనమే ముందున్నామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. నాగర్‌కర్నూల్‌లోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించగా మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎన్నడూ ఉద్యమంలో పాల్గొనని సన్నాసులు ఈ రోజు అభివృద్ధిపై చర్చిద్దామంటూ సవాల్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కరోనాతో దేశమంతా సంక్షోభంలో అల్లాడినా తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ సంక్షేమ పథకాలు ఆపలేదన్నారు. కల్వకుర్తి, నారాయణపేట నియోజకవర్గ సమావేశాల్లో ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, రాజేందర్‌రెడ్డి, ఎంపీ రాములు పాల్గొన్నారు. వచ్చే నెల 15న నిర్వహించే వరంగల్ విజయగర్జనకు భారీ సంఖ్యలో ఈ సందర్భంగా నేతలు పిలుపుచ్చారు.
నాగర్‌కర్నూల్, అక్టోబర్ 27: ఏలిననాడు ఎకరాకు నీళ్లివ్వని సన్నాసులు ఈ రోజు టీఆర్ఎస్ గురించి, కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారని వ్యవసాయశాఖ మం త్రి నిరంజన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రంకోసం ఏర్పడిన రాజకీయ పార్టీ టీఆర్ఎస్ అని, మాటను తూటాగా మా ర్చి రాష్ట్రం తెచ్చిన నేత కేసీఆర్ అని మంత్రి స్పష్టం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని ఎ మ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో ఏడేండ్లలో తెలంగాణ అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. పనిచేసి ప్రజల ఆశీస్సులు అడిగే పార్టీ అని, అందుకే ప్రజలు పార్టీని ఆశీర్వదిస్తున్నారన్నారు. 100పనులు చేస్తామని చెప్పిన చోట 90 చేస్తున్నామని, మిగతావి వసతిని బట్టి ముం దుకు సాగుతున్నామన్నారు. దశల వారీగా డబుల్ బె డ్రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. కేసీఆర్ మీద వ్యతిరేకత రాకపోదా మాకు అధికారం రాకపో దా.. అని ప్రతిపక్ష నాయకులు కలలు కంటున్నారన్నా రు. ఒకనాటి కరెంటు కష్టాలు ఇప్పుడు లేకుండా పో యాయని, మున్ముందు ఎప్పటికీ రావద్దని, తెలంగాణ లో ఒకనాటి వలసలు, సాగునీటి కష్టాలు ఇక రావన్నా రు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని మనుషులు బంగారం వేసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టి హేళన చేస్తున్నారన్నారు. గతంలో వడ్డీ కింద, రూ.10వేల నుంచి రూ.30 వేల వరకు ఎకరా భూమిని అమ్ముకున్నారన్నారు. స్వరాష్ట్రంలో సాగునీటి రాకతో పొలం బంగారమైందని, ఎకరా రూ.20 లక్షలు పెట్టినా దొరక డం లేదన్నారు. ప్రతి పొలంలో బంగారం లాంటి పం టలు పండుతున్నాయని, ఇదీ బంగారు తెలంగాణ అం టే అన్నారు. జీవితమంతా ఆంధ్రోళ్ల పంచనపడి బతికి ఎన్నడూ ఉద్యమంలో పాల్గొనని సన్నాసులు ఈ రోజు ఏడేండ్ల తెలంగాణ అభివృద్ధి మీద చర్చిద్దాం అని స వాల్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కొత్తగా 8 మెడికల్ కళాశాలలు కేసీఆర్ మంజూరు చేశారని, విడతల వారీగా మొత్తం జిల్లా కేంద్రాల్లో మెడికల్ కళాశాల లు ఏర్పాటు చేయాలన్నది కేసీఆర్ ఆలోచన అన్నారు. చంద్రబాబు గురించి మీడియా ఎంత హైప్ సృష్టించినా 2004లో ప్రజలు విసిరికొట్టారన్నది గుర్తుంచుకోవాలన్నారు. అధికారం ఇస్తే ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ వాటి ఊసే ఎత్తడం లేదని, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ మోడీ సర్కార్ ప్రైవేట్‌కు వేలం వేసి అమ్ముతున్నారన్నారు. అనంతరం ఎంపీ రాము లు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.