నందికొండ: శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు 90420 కూసెక్కుల ఇన్‌ఫ్లో రిజర్వాయర్‌కు చేరుతుంది. దీంతో నాగార్జునసాగర్ డ్యాం 6 క్రస్ట్ గేట్ల ద్వారా 48600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రిజ ర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.0450 టీఎంసీలు) అడుగులకు గాను పూర్తి స్థాయిలో నీరు నిల్వ ఉంది.
నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుండి కుడి కాల్వ ద్వారా 8221 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 32399 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసి ద్వారా 1200 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు. ఎడమ, వదర కాల్వల ద్వారా నీటి విడుదల లేదు.
నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి 90420 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతుంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను 883.10 ( 205.2258 టీఎంసీలు ) వద్ద నీరు నిల్వ ఉంది. శ్రీశైలంకు 114133 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది.