Mysuru Dasara | నిరాడంబరంగా దసరా వేడుకలు : సీఎం
Mysuru Dasara | నిరాడంబరంగా దసరా వేడుకలు : సీఎం | ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మైసూరు దసరా వేడుకలను ఈ ఏడాది సైతం నిరాడంబరంగా, సంప్రదాయ పద్ధతిలో నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు. మైసూరు దసరా రాష్ట్ర పండుగ అని, గతేడాది సైతం

బెంగళూరు : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మైసూరు దసరా వేడుకలను ఈ ఏడాది సైతం నిరాడంబరంగా, సంప్రదాయ పద్ధతిలో నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు. మైసూరు దసరా రాష్ట్ర పండుగ అని, గతేడాది సైతం కరోనా మహమ్మారి కారణంగా నిరాడంబరంగా జరుపుకున్నామని, ఈ సారి సైతం అలాగే నిర్వహిస్తామని తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఉత్సవాల నిర్వహణపై కమిటీ సమావేశం బొమ్మై అధ్యక్షతన జరిగింది. చాముండి హిల్స్‌పై ఉత్సవాలు ప్రారంభమై పది రోజుల పాటు జరుగుతాయని, జంబూ జవారీ నిర్వహించనున్నట్లు చెప్పారు.
మైసూరు, చామరాజనగర్, శ్రీరంగపట్నంలో దసరా పండుగను జరుపుకునేందుకు రూ.6కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. దసరా వేడుకలకు సంబంధించి మైసూరులో మౌలిక సదుపాయాలకు అంచనాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. అయితే ఉత్సవలు, సాంస్కృతిక కార్యక్రమాలన్ని ఈ సారి అంబ విలాస్ ప్యాలెస్, చాముండేశ్వరి ఆలయానికి పరిమితం చేశారు. గతేడాదిలాగా మైసూరు ప్యాలెస్ ప్రాంగణంలోనే జంబూ సవారీ జరుగనుంది. పది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు అక్టోబర్ 7న చాముండి హిల్స్‌లో ప్రారంభం కానున్నాయి. జాంబూ సవారీ అక్టోబర్ 15న మధ్యాహ్నం 2.45 గంటలకు జరుగుతుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

