హైదరాబాద్ : రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతితో అభివృద్ధి సాధించిన పంచాయతీలకు అవార్డుల పంట పండటంతో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 2019-20 సంవత్సరానికి గాను కేంద్రం ప్రకటించిన దీన్‌దయాళ్ ఉపాధ్యాయ సశక్తికిరణ్ పురస్కారాల్లో రాష్ర్టానికి 12 అవార్డులు లభించాయి.
ఈ అవార్డులు పొందిన 12 గ్రామపంచాయతీల ఆఫీస్ బేరర్లను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అభినందించారు. పల్లెప్రగతి కార్యక్రమం సీఎం కేసీఆర్ మనసులో నుంచి పుట్టిన ఆలోచన.. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆ శాఖ అధికారులు పల్లె ప్రగతి అమలు కోసం చేసిన కృషి వల్లే ఈ అవార్డులు వచ్చాయని కేటీఆర్ కొనియాడారు.
My compliments to the office bearers of the 12 village panchayats that have won National panchayat awards under various categories 👏
— KTR (@KTRTRS) April 1, 2021
“Palle Pragathi” brainchild of Hon’ble CM KCR Garu & able execution by Panchayat Raj Minister @DayakarRao2019 & his team have brought laurels pic.twitter.com/4iIMkgeOPm