
న్యూఢిల్లీ: నగరాల్లో చెత్త లేకుండా చేయడం, నీటి భద్రత కల్పించడమే లక్ష్యంగా స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0, అమృత్ 2.0లను ప్రారంభిస్తున్నట్టు ప్రధాని మోదీ చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో ఈ మిషన్లను ప్రారంభించారు. ‘దేశంలో రోజుకు లక్ష టన్నుల వ్యర్థాల ప్రాసెసింగ్ జరుగుతున్నది. మొత్తం వ్యర్థ్ధాల్లో ఇది దాదాపు 70%. ఇది 100 శాతానికి చేరుకోవాలి’ అని సూచించారు. ఈ పథకాల్లో భాగంగా నగరంలోని చెత్త గుట్టలను తొలగించి పూర్తిగా ప్రాసెసింగ్ చేస్తామని తెలిపారు.