హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ) : గ్లోబల్ మున్నూరుకాపు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 30,31 తేదీల్లో అమెరికాలో మహాసభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి మున్నూరుకాపు ప్రముఖుల సమావేశం జరిగింది. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, జోగు రామన్న, మాజీ ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, జాజుల సురేందర్, ప్రముఖ ఇంద్రజాలికులు సామల వేణు,
సంఘం ప్రముఖులు కొండా దేవయ్య, కొత్త లక్ష్మణ్, చంద్ర జనార్థన్,ఉసా రఘు, కొనగాల మహేశ్,రుద్ర సంతోష్, లవంగాల అనిల్, డాక్టర్ రామసాని వెంకట శ్రీనివాసరావు (ఖతార్), శ్రీధర్ (బోట్స్వానా) పాల్గొన్నారు.ఎంపీ వద్దిరాజు రవిచంద్రను కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చందు జనార్దన్, రాధామిత్ర మండలి సీనియర్ నాయకుడు అల్లుడు సాంబశివరావు, వ్యాపారవేత్త గంటాసాయి, సీనియర్ జర్నలిస్టు మేకల కల్యాణ్ చక్రవర్తి బంజారాహిల్స్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సమకాలీన అంశాలపై వారు ఇష్టాగోష్ఠిగా చర్చించుకున్నారు.