వేయిస్తంభాల గుడి సుందరీకరణకు ప్రజలు సహకరించాలి : మున్సిపల్ కమిషనర్ వెంకన్న
చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయ అభివృద్ధికి, సుందరీకరణకు స్థానిక ప్రజలందరూ సహకరించాలని మున్సిపల్ కమిషనర్ టి.వెంకన్న కోరారు.
హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 23: చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయ అభివృద్ధికి, సుందరీకరణకు స్థానిక ప్రజలందరూ సహకరించాలని మున్సిపల్ కమిషనర్ టి.వెంకన్న కోరారు. ‘కుడా’, మున్సిపల్ శాఖల సమన్వయంతో పనిచేస్తున్నామని, గుడి ముందు భాగంలోని గృహ యజమానులతో సంప్రదింపులు జరిపి వారికి కలెక్టర్ అనుమతితో నష్టపరిహారం చెల్లిస్తామని ఆయన అన్నారు. శుక్రవారం మున్సిపల్ కమిషనర్ దేవాలయాన్ని సందర్శించి ఉత్తిష్ఠ గణపతి దర్శనం చేసుకొని రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకం నిర్వర్తించుకున్నారు.
ఈనెల 10 నుంచి 22 వరకు నగరంలో ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవానికి వేయిస్తంభాల గుడి, పద్మాక్షమ్మగుడి, సిద్దేశ్వరాలయం, కాజీపేట మల్లికార్జునస్వామి దేవాలయం వివిధ ప్రాంతాలలో బతుకమ్మ ఆడుకునే మహిళలకు ప్రత్యేకంగా విద్యుత్ అలంకరణ, పారిశుద్ధ్య పనులు, ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించినందుకుగాను దేవాదాయ, ధర్మాదాయ శాఖ పక్షాన మున్సిపల్ కమిషనర్ని, సిబ్బందిని ఘనంగా సత్కరించారు.
దేవాలయ అభివృద్ధికి ముందు భాగంలో పార్కింగ్ స్థలం కోసం నిధులు మంజూరు చేసినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ వెంకన్న మాట్లాడుతూ నగరంలో ఎలాంటి శానిటేషన్ ఇబ్బంది లేకుండా ప్రతిరోజు మున్సిపల్ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ నిత్యం పర్యవేక్షి స్తున్నామని, వేయిస్తంభాల దేవాలయం ఒక చారిత్రిక ప్రదేశమని, దీన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నదన్నారు. ఎందరో దేశ విదేశస్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తుంటారని, దానికి అనుగుణంగా మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం రెండు శాఖలపై ఉన్నదన్నారు.
దేవాలయ అభివృద్ధికి సీఎం రూ.20 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. కేంద్ర పురావస్తు శాఖ వారు కూడా కొంత అభివృద్ధి పరుస్తున్నారని ఇంకా చేయాల్సి ఉన్నదని మరుగుదొడ్లకు ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలని ‘కుడా’ శాఖకు లెటర్ పంపించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి డి.అనిల్‌కుమార్ ప్రధానార్చకుడు గంగు ఉపేందర్‌శర్మ, మణికంఠశర్మ అవధాని, ప్రణవ్, దేవాలయ సిబ్బంది మధుకర్, రామకృష్ణ, రజిత, సుజాత సన్మానించారు. మున్సిపల్ అధికారులు డీఎంహెచ్‌వో రాజారెడ్డి, ఎంహెచ్వో రాజేష్, ఇతర మున్సిపల్ ఇంజనీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వేయిస్తంభాల గుడి సుందరీకరణకు ప్రజలు సహకరించాలి : మున్సిపల్ కమిషనర్ వెంకన్న
Speaker Sets Deadline | టీవీకేలో చేరిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు.. గడువు విధించిన స్పీకర్
Tiger Shroff | నేరస్థులను చూస్తే నవ్వొస్తుంది.. టైగర్ ష్రాఫ్ ఘటనపై ఆర్జీవీ రియాక్షన్
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

