హైదరాబాద్: అడ్వర్టైయిజింగ్, పబ్లిక్ రిలేషన్స్, డిజిటెల్ మార్కెటింగ్, కార్పొరేట్ ఈవెంట్ మేనేజ్మెంట్కు చెందిన కొత్త ఏజెన్సీ మల్టీవర్స్(Multiverse) హైదరాబాద్‌లో ప్రారంభమైంది. మాజీ జర్నలిస్టు విజయ్ అమృత్‌రాజ్ ఈ ఏజెన్సీని నెలకొల్పారు. వివిధ బ్రాండ్లకు విశ్వసనీయమైన ప్రమోషన్ ఏర్పాటు చేసే లక్ష్యంతో దీన్ని ప్రారంభించారు. పీఆర్లో విశేష అనుభవం ఉన్న ఆయన.. ఈ సంస్థను త్వరలో దేశంలోని వివిధ నగరాల్లో విస్తరించనున్నారు. గతంలో బయోలాజికల్-ఈ, టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థల్లో ఆయన కార్పొరేట్ కమ్యూనికేషన్స్ హెడ్‌గా పనిచేశారు. ప్రఖాత్య పబ్లిక్ రిలేషన్స్ ఏజెన్సీ రిడిఫ్యూజన్లోనూ ఆయనకు పనిచేసిన అనుభవం ఉన్నది. ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్‌లోనూ ఆయన కార్పొరేట్ కమ్యూనికేషన్స్ వ్యవహారాలు చూశారు.
ప్రకటనల్లో భాగంగా సంప్రదాయ మరియు డిజిటల్ మాధ్యమాల్లోవ్యూహాత్మక బ్రాండ్ ప్రచారం, ప్రజాసంబంధాల్లో భాగంగా ప్రతిష్ఠ నిర్వహణ, మీడియాసంబంధాలు, సంక్షోభ కమ్యూనికేషన్, విధాన పరిరక్షణ ఈ ఏజెన్సీ చేపట్టనున్నది. డిజిటల్ మార్కెటింగ్‌లో సోషల్ మీడియా నిర్వహణ, కంటెంట్ మార్కెటింగ్, SEO, ఆన్లైన్, చెల్లింపు ఆధారిత డిజిటల్ ప్రచారాలు నిర్వహించనున్నారు. ఇక కార్పొరేట్ ఈవెంట్ మేనేజ్మెంట్లో భాగంగా ఉత్పత్తుల ఆవిష్కరణలు, సంస్థాగత కార్యక్రమాలు, ప్రభుత్వ అనుబంధ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
మల్టీవర్స్ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ అమృత్‌రాజ్ మాట్లాడుతూ..హైదరాబాద్లోమల్టీవర్స్(www.multiverse-group.com)ను ప్రారంభించడం ఎంతో ఆనందంగాఉందని, చాలా సంస్థలు తమ బ్రాండ్ల గుర్తింపును పీఆర్, డిజిటల్, ప్రకటనలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వేర్వేరు ఏజెన్సీల మధ్య విభజించుకోవాల్సివస్తోందని, ఆ పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతోనే మల్టీవర్స్‌ను స్థాపించానన్నారు. క్లయింట్-సైడ్అనుభవం, కార్పొరేట్ వ్యవహారాల నైపుణ్యం, దీర్ఘకాలిక బ్రాండ్ నిర్మాణంలో విశ్వసనీయ భాగస్వామిగా నిలుస్తామన్నారు.