ముషీరాబాద్, నవంబర్ 10: బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులపై దాడులు చేయిస్తూ ఆ పార్టీ నేతలు దళితుల గురించి మాట్లాడటం సిగ్గుచేటని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర, జాతీయ అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్, మేడి పాపయ్య మండిపడ్డారు. బీజేపీ నాయకులు అంబేద్కర్ విగ్రహం ముందు డప్పుకొట్టి హడావుడి చేస్తే దళితులపై ప్రేమ ఉన్నట్టు కాదని, చిత్తశుద్ధి ఉంటే దేశవ్యాప్తంగా దళితబంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
బుధవారం విద్యానగర్లోని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దళితబంధు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించినప్పటికీ, బీజేపీ నేతలు రాజకీయ మైలేజీ కోసం అంబేద్కర్ విగ్రహం వద్ద డప్పులు కొట్టి హడావుడి చేయడం శోచనీయమని అన్నారు. డప్పులు కొట్టిన బీజేపీ నేతలలో ఒక్కరైనా దళితులు ఉన్నారా? అని ప్రశ్నించారు.