ముషీరాబాద్, జూలై 7 : ఉద్యమాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి ఎస్సీ వర్గీకరణ సాధించిన ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రాజ్యాధికార సాధనకు మాదిగలంతా ఏకమవ్వాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు.
మంగళవారం ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విద్యానగర్లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో జెండా ఎగురవేసిన అనంతరం మాట్లాడారు.