ఝరాసంగం, మార్చి 6 : ఉపాధి హామీ పనులను కూలీలందరూ సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎంపీడీవో సుధాకర్ సూచించారు. గురువారం మండల పరిధిలోని మాచనూర్ గ్రామ శివారులో చేపడుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి అక్కడ కల్పిస్తున్న మౌలిక వసతులపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆధార్‌కార్డును బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాలని సూచించారు. ఎండలు పెరిగిపోవడంతో రైతులు ఉదయం సమయంలోనే పనులు పూర్తి చేసుకొని ఇంటికి చేరుకోవాలని సూచించారు. వడదెబ్బ తగలకుండా పనులు ముందే ముగించాలన్నారు. పని ప్రదేశాల్లో తాగునీరు తప్పకుండా తీసుకెళ్లాలని తెలిపారు. పని ప్రదేశాల్లో సరైన వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం నర్సరీలో మొక్కల పెంపకంపై జాగ్రత్తలు తీసుకోవాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు.