నార్నూర్, సెప్టెంబర్ 9 : ప్రజా కవి కాళోజి నారాయణరావు అని ఎంపీడీవో రాథోడ్ గంగా సింగ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా కవి కాళోజీ నారాయణరావు జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు భాషకు, యాసకు వెన్న తెచ్చారని కొనియాడారు. తన రచనలతో సమాజాన్ని జాగృతం చేశారన్నారు. తెలంగాణ, స్వాతంత్ర ఉద్యమాలలో చురుకుగా పాల్గొని ప్రజలకు ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ నవీన్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ శారద, సిబ్బంది అర్జున్, శంకర్,పాషా, వినోద్ ఉన్నారు.