భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు తప్పనిసరి : ఎంపీడీవో పుల్లారావు
వర్ష భావ పరిస్థితులను అధిగమించడానికి భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు తప్పనిసరిగా నిర్మించాలని ఎంపీడీవో పుల్లారావు సూచించారు.
నార్నూర్, నవంబర్ 12 : వర్ష భావ పరిస్థితులను అధిగమించడానికి భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు తప్పనిసరిగా నిర్మించాలని ఎంపీడీవో పుల్లారావు సూచించారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీడీవో అధ్యక్షతన మండల ఇస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఆయా శాఖల అధికారులు మండల ప్రగతిని వెల్లడించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో మండల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
ఎల్ నినో ప్రభావంతో నీటి జలాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని, నీటిని వృథా కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. వృథా నీటిని అరికట్టేందుకు ఇంకుడు గుంతలు నిర్మించుకొవాలన్నారు. ప్రతి సమస్యను సమన్వయంతో పరిష్కరించి ప్రజలు ఇబ్బంది పడకుండా కృషి చేద్దామన్నారు. ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ డీఈ శ్రీనివాస్, ఎంపీఓ మహేష్, ఏవో ఆకాష్, ఆయా శాఖ అధికారులు, సర్పంచులు ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు తప్పనిసరి : ఎంపీడీవో పుల్లారావు
Faridabad Murder: టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి కాల్చివేత.. సీసీటీవీ వీడియో రిలీజ్
Murder | నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసి.. మహిళ దారుణ హత్య..!
Ramayana Box Office | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సునామీ.. వారం రోజుల్లోనే రూ.934 కోట్ల వసూళ్లు!
Vakiti Srihari | తాగేందుకు, వంటకూ రూ.20 ఫిల్టర్ డబ్బా నీళ్లే.. మంత్రి వాకిటి శ్రీహరి ఇలాఖాలో నీటి కష్టాలపై మహిళ.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

