Faridabad Murder: టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి కాల్చివేత.. సీసీటీవీ వీడియో రిలీజ్
Faridabad Murder: టెక్ మహీంద్రా ఆసియా మాజీ హెడ్ పరమ్‌జీత్ ధన్కర్ను ఫరీదాబాద్‌లో పొరుగింటి వ్యక్తి తుపాకీతో కాల్చి హత్య చేసిన విషయం తెలిసిందే. గత వారం జరిగిన ఆ ఘటనకు చెందిన సీసీటీవీ వీడియోను పోలీసులు రిలీజ్ చేశారు. హ్యాపీ దీపావళి.. ముబారక్.. అందర్నీ చంపేస్తా అంటూ నిందితుడు ఫైరింగ్ జరిపాడు.
న్యూఢిల్లీ : టెక్ మహీంద్రా ఆసియా మాజీ హెడ్ పరమ్‌జీత్ ధన్కర్ ఫరీదాబాద్(Faridabad Murder)లో తన పొరుగింటి వ్యక్తి జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే సీసీటీవీకి ఆ కాల్పుల ఘటన చిక్కింది. ఆ వీడియోను ఇప్పుడు పోలీసులు రిలీజ్ చేశారు. నిందితుడు మోనూ శర్మ, పరమ్‌జీత్ మధ్య పార్కింగ్ అంశంలో వాగ్వాదం జరిగినట్లు వీడియోలో ఉన్నది. పరమ్‌జీత్ మాట్లాడుతున్న సమయంలో.. గన్ తీసి మోనూ శర్మ ఫైరింగ్‌కు పాల్పడ్డాడు. పక్కనే ఉన్న పరమ్‌జీత్ కుమారుడు భయంతో పరుగులు తీశాడు. మోను తన లైసెన్స్డ్ తుపాకీతో 15 రౌండ్లు కాల్చగా, 9 తూటాలు పరమ్‌జీత్‌కు తగిలాయి.
టీషర్ట్ ధరించిన మోనూ శర్మ తన ప్యాంటు జేబులో నుంచి గన్ తీసి అకస్మాత్తుగా ఫైరింగ్ చేశాడు. 5 సెకన్లలో మల్టిపుల్ రౌండ్లు కాల్చాడు. టెకీ మహేంద్ర మాజీ ఉద్యోగి పరుగులు తీస్తున్నా.. నిందితుడు శర్మ మాత్రం బుల్లెట్ల వర్షం కురిపించాడు. బిల్డింగ్ గేటు తీసి బాధితుడు తప్పించుకునే ప్రయత్నం చేసినా అతన్ని నిందితుడు వదిలిపెట్టలేదు. కుప్పకూలిన పరమ్‌జీత్ వద్దకు ఓ వృద్ధ మహిళ వచ్చి నిందితుడిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. మళ్లీ గన్ను రీలోడ్ చేసిన మోనూశర్మ .. పరమ్జీత్పై కాల్పులు జరిపాడు. ఫైరింగ్ చేస్తున్న సమయంలో నిందితుడు హ్యాపీ దీపావళి, ముబారక్ అని అరిచాడు. అందర్నీ చంపేస్తా, అందర్నీ చంపాకే వెళ్లిపోతా అని గట్టిగా అరుస్తున్నట్లు వీడియోలో ఉన్నది.
పరమ్‌జీత్ తన మేనల్లుడి వివాహానికి హాజరయ్యేందుకు సింగపూర్ నుంచి భారత్‌కు వచ్చారు. పరమ్‌జీత్ కుటుంబ సభ్యులకు, వారి పొరుగింట్లో ఉంటున్న మోను శర్మ కుటుంబ సభ్యులకు తరచూ గొడవలు జరిగేవి. గత శుక్రవారం రాత్రి కారు పార్కింగ్ విషయంలో పరమ్‌జీత్, మోను మధ్య ఘర్షణ జరిగింది. మోను తన లైసెన్స్డ్ తుపాకీతో 15 రౌండ్లు కాల్చగా, 9 తూటాలు పరమ్‌జీత్‌కు తగిలాయి. దీంతో ఆయన ప్రాణాలు విడిచారు. కార్ల పార్కింగ్, పెంపుడు కుక్క మూత్ర విసర్జన వంటి సాధారణ విషయాల్లో గొడవ పడేవారని తెలుస్తున్నది. రెండు రోజులకే మోనును అరెస్ట్ చేశారు. మోను భార్య, కుమార్తె, కుమారుడు, సోదరుడు నిందితులని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Hang him. Call me judgmental, but society has no room for a menace like Monu Sharma. His history of speeding, brawls, and blatant disrespect for the law proves he is a ticking time bomb. Keeping him alive in prison is a waste of taxpayer money, and letting him out risks innocent lives.
If ‘procedural loopholes’ allow him to walk free, the justice system becomes an accomplice to murder with blood on its own hands.
@SupremeCourtIND @cmohry @NayabSainiBJP @police_haryana @FBDPolice @barandbench @LiveLawIndia
#FaridabadFiring
— Amit | अमित | امیت (@tweets_by_amit) November 12, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Faridabad Murder: టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి కాల్చివేత.. సీసీటీవీ వీడియో రిలీజ్
Murder | నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసి.. మహిళ దారుణ హత్య..!
Ramayana Box Office | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సునామీ.. వారం రోజుల్లోనే రూ.934 కోట్ల వసూళ్లు!
Vakiti Srihari | తాగేందుకు, వంటకూ రూ.20 ఫిల్టర్ డబ్బా నీళ్లే.. మంత్రి వాకిటి శ్రీహరి ఇలాఖాలో నీటి కష్టాలపై మహిళ.. వీడియో
RSS Chief Mohan Bhagwat: ఒకప్పుడు క్రాకర్స్‌తో గాలి శుభ్రమయ్యేది: ఆర్ఎస్ఎస్ చీఫ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

