రేవంత్ సర్కార్‌కు ఓటుతో బుద్ధి చెప్పండి
గద్దెనెక్కిన రేవంత్ ప్రభుత్వానికి త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని వద్దిరాజు రవిచంద్ర కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
- ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన సమావేశంలో ఎంపీ వద్దిరాజు
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల ముం దు నిరుద్యోగులు, ఉద్యోగులు, యువతకు ఎన్నో హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ ప్రభుత్వానికి త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని పార్లమెంట్ ఫ్లోర్ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు అధ్యక్షతన ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు అవగాహన సమావేశం సోమవారం జరిగింది.
ఈ సందర్భంగా వద్దిరాజు మాట్లాడుతూ.. ఖమ్మం – వరంగల్ – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని కోరారు. పట్టభద్రులు ఓటు నమోదు చేసుకునే విధంగా అవగాహన కల్పించడంతోపాటు వారికి తోడ్పాటు అందించాలని సూచించారు. కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రతి డివిజన్‌కు ఒక ఆపరేటర్‌ను పెట్టి పట్టభద్రు ల ఓట్లు నమోదు చేస్తున్నామని చెప్పారు.
ఓట్లడిగే అర్హత బీఆర్ఎస్కే ఉన్నది: ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులను ఓట్లు అడిగే అర్హత బీఆర్ఎస్కు మాత్రమే ఉన్నదని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు స్పష్టం చేశారు. ఎల్ నినో పేరు చెప్పి రైతులు పంటలు వేయవద్దని అంటున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, రైల్వే బోర్డు మెంబర్ బీమా శ్రీధర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

